- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలోని వైట్ హౌస్ వేదికగా ప్రముఖ టెక్ సంస్థల అధిపతులు, దిగ్గజ సీఈఓలకు ట్రంప్ విందు ఇచ్చారు. అయితే ఈ విందుకు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌కు ఆహ్వానం అందలేదని, అందుకే ఆయన హాజరుకాలేదని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై మస్క్ స్పందించారు. ‘నాకు ఆహ్వానం అందింది. కానీ అనివార్య కారణాల వల్ల నేను హాజరుకాలేకపోయాను. నా ప్రతినిధి అక్కడ ఉన్నారు’ అని క్లారిటీ ఇచ్చారు.
- Advertisement -