Saturday, October 25, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమ‌లేషియా వేదిక‌గా ట్రంప్-జిన్‌పింగ్ భేటీ?

మ‌లేషియా వేదిక‌గా ట్రంప్-జిన్‌పింగ్ భేటీ?

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: వాణిజ్య యుద్ధం తీవ్రతరం కాకుండా నిరోధించడానికి అమెరికా, చైనా దేశాలకు చెందిన అగ్ర ఆర్థిక అధికారులు శనివారం కౌలాలంపూర్‌లో చర్చలు జరపనున్నారని బ్రిటన్‌ వార్తాపత్రిక సన్‌ వెల్లడించింది. ఇరు దేశాల ఆర్థికరంగ అధికారులు చర్చలు జరిపి.. సుంకాలపై ఓ స్పష్టత వచ్చిన తర్వాత.. ఇరు దేశాల అగ్రనేతల చర్చలకు మార్గం సుగమం చేయనున్నట్టు తెలుస్తోంది. బహుశా వచ్చేవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సుంకాలపై చర్చలు జరిపే అవకాశం ఉందని బ్రిటన్‌ మీడియా తెలిపింది. చైనా వస్తువులపై కొత్తగా వంద శాతం సుంకాలను విధిస్తామని ట్రంప్‌ బెదిరించారు.

అమెరికా విధించిన ఈ భారీ సుంకాలపై ఆగేయాసియా దేశాల సంఘం శిఖరాగ్ర సమావేశం మలేషియాలో అక్టోబర్‌ 26-28 నుండి జరగనుంది. ఈ సమావేశంలో ట్రంప్‌ సుంకాలపైనా చర్చలు జరగనున్నాయి. దీంతో భారీ సుంకాల విషయంపై ఆగేయాసియా దేశాలు చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సన్‌ వార్తా పత్రిక తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -