Wednesday, October 29, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంరేపు జిన్‌పింగ్‌తో ట్రంప్ భేటీ

రేపు జిన్‌పింగ్‌తో ట్రంప్ భేటీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఏషియాన్ స‌ద‌స్సుకు వ‌చ్చిన సంద‌ర్భంగా ఆసియా దేశాల్లో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల జ‌పాన్‌లో రెండు రోజులు ఉన్నారు. తాజాగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రేపు(గురువారం) దక్షిణ కొరియాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం కానున్నారు. వ్యూహాత్మక, దీర్ఘకాలిక ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకుంటారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది.

ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకార (ఎపిఇసి) శిఖరాగ్ర సమావేశం సమయంలో ఇరువురునేతలు సమావేశం కానున్నారని పేర్కొంది. చైనా మరియు అమెరికా మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. ద్వైపాక్షిక సంబంధాలు మరియు పరస్పర ప్రయోజన అంశాలపై అభిప్రాయాలను పంచుకునేందుకు అధ్యక్షుడు జిన్‌పింగ్‌ బుసాన్‌లో ట్రంప్‌తో సమావేశమవుతారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గౌ జియాకున్‌ ఆ ప్రకటనలో తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -