వాషింగ్టన్ : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో తాను శిఖరాగ్ర సదస్సు జరపాలనుకోవడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం చెప్పారు. అయితే, జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు చైనాలో పర్యటించవచ్చునని వ్యాఖ్యానించారు. లేకపోతే తనకు ఆసక్తి లేదన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ ఏడాది చివరిలో ఆసియా దేశాల్లో ట్రంప్ పర్యటించనున్నారు. ఆ సందర్భంగా జిన్‌పింగ్, ట్రంప్‌ల మధ్య సమావేశం జరిగే అవకాశం గురించి ట్రంప్, జిన్‌పింగ్ సహాయకులు చర్చించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, భద్రతా పరమైన ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ట్రంప్ జరిపే పర్యటన ఇరువురు నేతల మధ్య ముఖాముఖి సమావేశానికి వేదిక అవుతుంది. స్టాకహేోంలో ఈ వారంలో అమెరికా, చైనా మూడవ దఫా వాణిజ్య చర్చలు జరగనున్నాయి. నేతల భేటీకి ముందు ఈ సమావేశంలో సన్నాహాలు జరిగే అవకాశం వుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
చైనాలో పర్యటనకు అవకాశం : ట్రంప్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES