Thursday, March 5, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్‌ దూకుడుకు కళ్లెం !

ట్రంప్‌ దూకుడుకు కళ్లెం !

- Advertisement -

అధికారాల పరిమితంపై సెనెట్‌లో ఓటింగ్‌

వాషింగ్టన్‌ : అమెరికన్‌ కాంగ్రెస్‌ ఆమోదం లేకుండా ఇరాన్‌పై సైనిక చర్యను కొనసాగిస్తున్న అధ్యక్షుడు ట్రంప్‌ అధికారాలను పరిమితం చేయడానికి ఉద్దేశించిన తీర్మానంపై బుధవారం అమెరికా సెనెట్‌ ఓటింగ్‌ జరుపుతోంది. అమెరికా ప్రతినిధుల సభలో కూడా ఇదే తరహాలో ఓటింగ్‌ జరుగుతుందని భావిస్తున్నారు. ఫిబ్రవరి 28న ట్రంప్‌ విస్తు గొలిపే రీతిలో ఒక్కసారిగా ఇరాన్‌పై దాడి ప్రారంభించారు. దీనికి కాంగ్రెస్‌ నుండి ఎలాంటి ముందస్తు అనుమతి లేదు. ఈ దాడులు త్వరితగతిన పశ్చిమాసియా అంతటా వ్యాప్తించాయి.

అయితే ట్రంప్‌ అధికారాలను పరిమితం చేయాలని అనుకున్నా రిపబ్లికన్ల నియంత్రణలో గల కాంగ్రెస్‌లో ఈ తీర్మానాలు ఆమోదం పొందే అవకాశం కనిపించడం లేదు. పైగా ట్రంప్‌ వీటో చేస్తారు కూడా. అయినా కాంగ్రెస్‌ సభ్యులు ఈ యుద్ధంపై తమ వైఖరులేంటనేది బహిరంగంగా వెల్లడించడానికి అవకాశం వుంటుంది. కాంగ్రెస్‌ రాజ్యాంగబద్ధమైన తన అధికారాన్ని స్పష్టం చేయాల్సిందేనని సెనెట ర్‌ టిమ్‌ కైనే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ యుద్ధ అధికారాల తీర్మానానికి రూపకర్త అయనే. రిపబ్లికన్‌ సభ్యుల్లో చాలామంది తీర్మానాన్ని వ్యతిరేకిస్తారని భావిస్తున్నారు. కాగా డెమోక్రాట్లు మాత్రం దీనికి బలమైన మద్దతును ప్రకటిస్తారని ప్రతినిధుల సభలో డెమోక్రాట్‌ నేత హకీమ్‌ జెఫ్రీస్‌ భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -