- Advertisement -
నవతెలంగాణ – వేములవాడ
నిజాలను నిర్భయంగా రాయాలి. వార్త కథనాల్లో వచ్చే వార్త కథనాలని నిజమని ప్రజలు విశ్వసిస్తారు. కాబట్టి ప్రింట్ మీడియా, ఎలక్ట్రాన్ మీడియా ప్రజలకు, ప్రభుత్వానికి, అధికారులకు వారధిగా నిలుస్తుందని వేములవాడ ఏ ఎస్ పి శేషాద్రి రెడ్డి అన్నారు. వాస్తవాలను ప్రతిబింబిం చే వార్తలు రాసి ప్రజలతో పాటు అధికారుల మెప్పు పొందేలా నవతెలంగాణ తెలుగు దినపత్రిక వాస్తవాలను వెలికితీస్తూ.. ప్రజల పక్షాన నిలబడి ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు. నవతెలంగాణ 10వ వార్షికోత్సవం సందర్భంగా పత్రిక యాజమాన్యం, సిబ్బంది, విలేకరులకు ఏ ఎస్ పి శేషాద్రి రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -