Tuesday, July 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్క్షయ వ్యాధిగ్రస్తులు పౌష్టికాహారం తీసుకోవాలి..

క్షయ వ్యాధిగ్రస్తులు పౌష్టికాహారం తీసుకోవాలి..

- Advertisement -

నవతెలంగాణ డిచ్ పల్లి
క్షయ వ్యాధిగ్రస్తులు చికిత్స సమయంలో పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని ఇందల్ వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ క్రిస్టినా అన్నారు. టీబి ముక్త్  భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగ నిజామాబాద్ జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ సహకారంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందల్ వాయి పరిధిలోని డిచ్ పల్లి, ఇందల్ వాయి మండలంలోని క్షయ వ్యాధిగ్రస్థులకు 25 కిట్లను ఆసుపత్రిలో అందజేశారు. క్షయ వ్యాధితో బాధపడుతున్న రోగులు సమయానుకూలంగా మందులు వేసుకోవాలని వాటితో పాటే పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల క్షయ వ్యాధి తొందరగా నయం అవుతుందని, అన్ని స్వచ్ఛంద సంస్థలు కార్పొరేట్ సంస్థలు ఇలా పోషక కిట్లను ఇవ్వడానికి ముందుకు రావాలని వైద్యాధికారి క్రిస్టినా సూచించారు. క్షయ వ్యాధి లేని సమాజాన్ని నిర్మించాలని అందుకు సమాజం యొక్క సహకారం అవసరమని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్షయ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ ఆరోగ్య పర్యవేక్షకులు అక్బర్ అలీ, దేవపాల, టీ. బి. ఎస్. టీ. ఎల్. ఎస్ పద్మ, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -