అట్లకాడతో వాతలు
నవతెలంగాణ – బంజారాహిల్స్
హైదరాబాద్ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. సరిగ్గా చదవడం లేదని ఏడేండ్ల బాలుడిపై ట్యూషన్ టీచర్ అట్లకాడతో వాతలు పెట్టింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓయూ కాలనీకి చెందిన ఏడేండ్ల వల్లు తేజ నందన్ ఒకటో తరగతి చదువుతున్నాడు. స్థానికంగా ఉన్న మానస అనే టీచర్ వద్దకు బాలుడిని తల్లిదండ్రులు ట్యూషన్‌కు పంపుతున్నారు. గురువారం సాయంత్రం ట్యూషన్‌కు వెళ్లాడు. అయితే, సరిగ్గా చదవడం లేదనే కారణంతో గ్యాస్ స్టౌవ్‌పై వేడి చేసిన అట్లకాడతో బాలుడి చేతులు, కాళ్లు, చెంపలపైన మొత్తం 8 చోట్ల ట్యూషన్ టీచర్ వాతలు పెట్టింది. విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు ఫిల్మ్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేయగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం గోల్కొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయాల వల్ల బాలుడు నడవలేకపోతున్నాడని తెలిసింది. తమ కొడుకును విచక్షణారహితంగా అట్లకాడతో కాల్చిన మానసపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
చిన్నారిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



