చెన్నై : కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి తమిళగ వెట్రి కజగమ్ (టీవీకే), నటుడు విజయ్ ను సీబీఐ విచారణకు హాజరయ్యారు. విచారణ కోసం సోమవారం ఉదయం చెన్నై నుంచి ఢిల్లీ చేరుకున్నారు. కరూర్ తొక్కిసలాటలో 41మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై దర్యాప్తు పలు మలుపులు తిరిగింది. ప్రారంభంలో.. ఈ ఘటనపై విచారణ కోసం మద్రాస్ హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (ఎస్‌ఐటీ) ఏర్పాటు చేసింది. అనంతరం ఈ కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు సీబీఐకి బదిలీ చేసింది. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలోని కమిటీ విచారణను పర్యవేక్షించాలని ఆదేశించింది.
స్వతంత్ర, పారదర్శకతతో కూడిన దర్యాప్తు అవసరమనే వాదనతో ఏకీభవిస్తూ. తమిళనాడు ప్రభుత్వం గతంలో నియమించిన ఏకసభ్య కమిషన్‌ను కూడా సుప్రీంకోర్టు రద్దు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి పలు వివరాలను సేకరించింది. ఇటీవల విజయ్ కు సమన్లు జారీ చేసింది. త్వరలో తమిళనాడు ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. బీజేపీ పార్టీతో పొత్తు ఉండదని విజయ్ ఇటీవల ప్రకటించారు. అయితే ఆ ప్రకటన అనంతరం తొక్కిసలాట కేసు దర్యాప్తులో సీబీఐ వేగం పెంచడం గమనార్హం..
సీబీఐ విచారణకు హాజరైన టీవీకే పార్టీ అధిపతి విజయ్
- Advertisement -
- Advertisement -



