– విషాదంలో గ్రామ ప్రజలు
నవతెలంగాణ – కామారెడ్డి
గ్రామానికి చెందిన గుర్రాల పెద్ద నర్సింలు మంజుల దంపతులకు ఇద్దరు కవలలే సంతానం. నర్సింలు రోజువారీ మేస్త్రీ పని చేస్తుండగా, మంజుల బీడీలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇద్దరి కష్టార్జితంతో ఉన్నదాంట్లో సంతోషంగా గడుపుతూ ఇద్దరు కొడుకులను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. తమ భవిష్యత్తు పిల్లలతోనే అని కలలు కన్నారు. ఒకేసారి పుట్టిన ఇద్దరు పిల్లలు ఒకేసారి మరణించడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఒకేసారి ఇద్దరు బాలురు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
కామారెడ్డి మండలంలోని తిమ్మప్ప పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు కవలలు ఈతకు వెళ్లి కుంటలో పడి మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు ఉన్నాయి. కామారెడ్డి మండలానికి చెందిన తిమ్మకపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు కవల పిల్లలు అయిన రాము, లక్ష్మణ్ (ఇద్దరి వయసు 13 సంవత్సరాలు) అనువారు అదే గ్రామంలో జడ్పిహెచ్ఎస్ స్కూల్లో ఎనిమిదో ఎనిమిదవ తరగతి చదువుతున్నారు. వారు స్కూలు అయిపోయిన అనంతరం ఇంటికి వచ్చి, తర్వాత ఈత కొట్టడానికి అని వారి గ్రామ శివారులోని ఒక కుంటలోకి వెళ్లారు. కుంటలో లోతు ఎక్కువగా ఉండటం పూర్తిగా నీటితో ఉండడం వలన వారికి ఈత రాక, వారు ఆ కుంటలో మునిగి మరణించినారు. అతని తండ్రి యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎస్.ఐ బి రంజిత్ విచారణ ప్రారంభించారు.