Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుమహా టీవీ న్యూస్ ఛానల్‌పై దాడిని ఖండించిన‌ TWJF

మహా టీవీ న్యూస్ ఛానల్‌పై దాడిని ఖండించిన‌ TWJF

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: మహా టీవీ న్యూస్ ఛానల్ పై బీఆర్ఎస్ కార్యకర్తల దాడిని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. హైదరాబాద్ నగరం నడిబొడ్డులో ఛానల్ ప్రధాన కార్యాలయంలో జర్నలిస్టులు పని చేస్తున్న సమయంలోనే బీఆర్ఎస్ నాయకులు.. పెద్ద పెద్ద రాళ్ళతో విధ్వంసానికి పాల్పడడం, బీభత్సం సృష్టించడం సరికాదని ఫెడరేషన్ అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య అన్నారు. ఇది ముమ్మాటికీ మీడియా స్వేచ్ఛపై తీవ్రమైన దాడి అని వ్యాఖ్యానించారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img