- Advertisement -
నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని అమ్రాద్ గ్రామంలోని సృతిక అనే మహిళ మెడలో నుంచి పల్సర్ బైక్ పై వచ్చి లకెళ్ళినట్లు బాధితులు శనివారం తెలిపారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం ముగ్గురు మహిళలు అమ్రాధ్ గ్రామం నుంచి మానిక్ బందర్ గ్రామం వరకు వాకింగ్ చేస్తుండగా.. పల్సర్ బైక్ పై ఇద్దరు వ్యక్తులు వచ్చి శృతి అనే మహిళ మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసు గుంజుకొని వెళ్లారన్నారు. స్థానిక పోలీస్ లకు పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -