Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్దొంగ సొత్తు కొనుగోలు చేసిన ఇద్దరు అరెస్ట్ 

దొంగ సొత్తు కొనుగోలు చేసిన ఇద్దరు అరెస్ట్ 

- Advertisement -

–  బంగారం ఆభరణాలు స్వాధీనం: ఎస్పీ
నవతెలంగాణ –  కామారెడ్డి

జాతీయ రహదారులపై దోపిడీలు, గ్రామాల్లో ఇళ్ల దొంగతనాలకు పాల్పడిన పార్థి గ్యాంగ్‌లో ప్రధాన నిందితుడు భాస్కర్ బాపూరావు చవాన్ (ఎ 2 ) ను గాంధారి పోలీసులు ఈ నెల7న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణలో  అతను దొంగ సొత్తును మహారాష్ట్రకు చెందిన బీరదర్ అభిషేక్, ఇర్ఫాన్ నూర్ ఖాన్‌లకు అమ్మినట్లు బయటపడింది.

దొంగ సొత్తు అని తెలిసి కూడా కొనుగోలు చేసిన ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి 8 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఇద్దరినీ రిమాండ్‌కు తరలించడం జరిగిందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ  దొంగ సొత్తును ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయరాదనీ,  ఎవరికైనా ఇలాంటి సొత్తు అందినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలనీ,  లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. ఈ కేసు ఛేదనలో భాగమైన సదాశివ నగర్  సిఐ బి. సంతోష్ కుమార్, సిసిఎస్ సిఐ శ్రీనివాస్, ఎస్‌ఐ బి. ఆంజనేయులు, సిసిఎస్ ఎస్‌ఐ ఉస్మాన్, సిసిఎస్ సిబ్బంది, స్థానిక పోలీసులను  ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad