నవతెలంగాణ -సుల్తాన్ బజార్ : పవిత్రమైన వైద్యవృత్తిలో ఉంటూ అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వైద్యులను కఠినంగా శిక్షించే విధంగా చట్టాన్ని సవరించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాష్ట్ర శాఖ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం నిర్వాహకురాలు డా. నమ్రత, ఎనస్థీషియా నిపుణుడు, గాంధీ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. సదానందం చేసిన నవజాత శిశువుల కొనుగోలు, అమ్మకాలతో పాటు అనై తిక సరోగసి వ్యాపార ఘటనలను ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డా.డి. ద్వారకా నాథెడ్డి, గౌరవ కార్యదర్శి డా.వి.అశోక్, కోశాధికారి డా.టి. దయాళ్ సింగ్ ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఆ ఇద్దురు వైద్యులను ఐఎంఏ సభ్యత్వం నుంచి తక్షణమే తొలిగిస్తున్నామని తెలిపారు.
ఐఎంఏ నుంచి ఇద్దరు వైద్యుల తొలగింపు…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES