Wednesday, August 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలురేవంత్‌రెడ్డి స‌ర్కార్ ధ‌ర్నాకు రెండు గంటల పర్మిషన్

రేవంత్‌రెడ్డి స‌ర్కార్ ధ‌ర్నాకు రెండు గంటల పర్మిషన్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: తెలంగాణ‌లో బీసీల‌కు 42శాతం రిజ‌ర్వేష‌న్లే లక్ష్యంగా చ‌లో ఢిల్లీకి కాంగ్రెస్ ప్ర‌భుత్వం పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. బీసీ రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ఈ రోజు ఉదయం 11 గంటల లకు జంతర్ మంతర్‌ లో తెలంగాణ కాంగ్రెస్ బీసీ ధర్నా చేయనుంది. ఈ ధర్నాకు లోకల్ పోలీసులు రెండు గంటల పాటు పర్మిషన్ ఇచ్చారు.

ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్​మహేశ్​కుమార్​ గౌడ్​తో పాటు మంత్రులు, కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీలోని బీసీ నేతలు, బీసీ సంఘాల నాయకులంతా ఢిల్లీ చేరుకున్నారు. జంతర్​మంతర్​వద్ద సుమారు 2వేల మంది ప్రతినిధులతో తెలంగాణ సర్కారు చేపట్టనున్న ఈ ధర్నాకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూట‌మిలోని కీలక నాయ‌కులు హాజ‌రై త‌మ సంఘీభావం తెలుప‌నున్నారు.ఈ మేరకు స్థానిక నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -