- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలోని గంగుళూరు పోలీసు స్టేషన్ పరిధిలోని బోడ్లా-పుస్నార్ అడవుల్లో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు డీఆర్జీ జవాన్లకు గాయాలయ్యాయి. గాయపడిన జవాన్లను అధికారులు హెలికాప్టర్ ద్వారా రాయపూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కోలుకుంటున్నారని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. కాగా ఎదురు కాల్పుల్లో తప్పించుకున్న మావోల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
- Advertisement -