Thursday, July 31, 2025
E-PAPER
Homeజాతీయంఇద్దరు కేరళ నన్స్‌ని విడుదల చేయాలి…పార్లమెంటు ఎదుట ఎంపీల నిర‌స‌న‌

ఇద్దరు కేరళ నన్స్‌ని విడుదల చేయాలి…పార్లమెంటు ఎదుట ఎంపీల నిర‌స‌న‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌లో అరెస్టు చేసిన ఇద్దరు కేరళ నన్స్‌ని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ.. పార్లమెంటు వెలుపల బుధవారం ప్రతిపక్ష ఎంపీలు నిరసనలు చేశారు. ఈ నిరసనల్లో వయనాడ్‌ ఎంపి ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఈ నిరసనల్లో వారు ‘నన్స్‌ని విడుదల చేయండి.. గూండాలను అరెస్టు చేయండి’ అని రాసిన ప్లకార్డులు పట్టుకుని నిరసన చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష ఎంపీలు కేరళ నన్స్‌పై ఛత్తీస్‌గడ్‌ పోలీసులు తప్పుడు కేసులు బనాయించారని, వారిని దుర్భాలాషలాడుతున్నారని ఆరోపించారు. పార్లమెంటు వెలుపల ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడుతూ… ‘కేరళకు చెందిన నన్స్‌ పట్ల పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తించారు. వారు చేయని పనులకు వారిపై ఆరోపణలు చేసి.. అరెస్టు చేశారు. వారిని అన్యాయంగా కొట్టిమరీ తీసుకెళ్లారు. మహిళపట్ల ప్రదర్శించిన అనుచిత ప్రవర్తన సరైంది కాదు. వారు చేయని పనులకు వారిని నిందించకూడదు’ అని ఆమె అన్నారు.
కాగా, మానవ అక్రమ రవాణాకు పాల్పడ్డారని, మత మార్పిడికి పాల్పడ్డారనే ఆరోపణలపై జూలై 25వ తేదీన ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ రైల్వేస్టేషన్‌లో పోలీసులు అరెస్టు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -