Thursday, August 7, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపుట్టపాక వాసులకు రెండు జాతీయ అవార్డులు….

పుట్టపాక వాసులకు రెండు జాతీయ అవార్డులు….

- Advertisement -

– రాష్ట్ర స్థాయిలో జిల్లాకు అయిదు అవార్డులు…
– చేనేత, జోలి శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస్..

నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్ : యాదాద్రి భువనగిరి జిల్లాలోని పుట్టపాక గ్రామం అంటే పట్టుచీరలను సహజ సిద్ధరంగులతో జాతీయ రాష్ట్ర స్థాయి అవార్డులను సొంతం చేసుకోవడంలో అవార్డుల పుట్టగా పేరుంది. ఈ గ్రామానికి రెండు పద్మశ్రీ అవార్డులు, 10 జాతీయ అవార్డులు, 20 కి పైగా రాష్ట్రస్థాయి అవార్డులు దక్కించుకోవడంతో జాతీయ స్థాయిలో ఈ గ్రామానికి ప్రత్యేకత చోటుచేసుకుంది.
జాతీయ అవార్డుకు ఎంపికైన గూడ పవన్… పుట్టపాక గ్రామానికి చెందిన గూడ పవన్ గ్రామానికి ఉన్న ప్రత్యేకతతో పూర్తిగా తీసుకొని రాష్ట్రస్థాయిలో అవార్డును అందుకున్నారు. ఈనెల 7వ తేదీన ఢిల్లీలోని నేషనల్ అవార్డును రాష్ట్రపతి ద్రౌపతి మురుముచేతుల మీదుగా న్యూఢిల్లీలోని భారత్ కళ్యాణ మండపంలో అందుకోబోతున్నారు.

ప్రకృతి రంగులతో మగ్గంపై డిజైన్….
సాధారణంగా పట్టు నూలుకు రంగులు అద్దడానికి రకరకాల రసాయనాలను వినియోగిస్తుంటారు. రసాయన వినియోగించడం వలన చీరలు డిజైన్ తయారు చేయడంలో ఇబ్బందులు పడడంతో పాటుగా, రంగు విలుచుకోవడానికి అవకాశం ఉంది. దీంతో ఆ చేనేత వస్త్రానికి విలువ తగ్గుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి అతను ప్రకృతి నుంచి సేకరించిన బంతి పూలు, దానిమ్మ పండ్లు, మంజిష్ట వేర్లు, ఇండిగో నీలం, చావల్ కుడి పొడి, బెల్లం, వనమూలికలతో తయారుచేసిన సహజ సిద్ధ రంగులను ఉపయోగిస్తున్నాడు, సహజ సిద్ధరంగులను మల్బరీ పట్టుదారానికి అద్ది, జాతీయ భౌగోళిక గుర్తింపు (జియో టాగ్ ) పొందిన తేలియ రుమాల్ డిజైన్ తో పట్టు చీరలు మగ్గంపై నేస్తున్నారు, డిజైన్ తో మగ్గం పై నేయడంతో పాటుగా పట్టుచీరలో ప్రాచీనత సాంప్రదాయాలు, ప్రతిబింబించేలా రథంపేట, హోమగుండం, బంతి పువ్వు, మల్లెపువ్వు, పచ్చీసు, చక్రం, వజ్రం , మద్ది కాయతో రంగులతో 16 రకాల వస్తువులతో డిజైన్ రూపొందించాడు.
ఆరు నెలలు కష్టపడాల్సిందే….
సహజ సిద్ధమైన రంగులను అద్దడానికి అద్దడానికి సుమారు ఆరు నెలలు కష్టపడాల్సి ఉంటుంది. ప్రకృతి నుంచి సేకరించిన పదార్థాలను ఎండబెట్టి, 20 రోజులపాటు మగ్గ బెట్టాలి. తర్వాత వాటిని పొడి చేసి, సహజ సిద్ధ రంగులను తయారు చేస్తారు. ఈ రంగులను మల్బరి పట్టు దారానికి అద్ది తేలియా రుమాల్ డిజైన్ తో పట్టుచీర నేస్తారు. భారతీయ సంస్కృతితో పాటుగా ప్రాచీన సాంప్రదాయం ఉట్టిపాడేలా ఆరు నెలలు శ్రమించి చీరలు తయారు చేస్తారు. చీర ముడతలు పడకుండా మృదువైన పట్టును వాడతారు. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా చేనేత వృత్తిని అందిపుచ్చుకున్న పవన్ ఇందులోనే ప్రత్యేకత చూపించాలనే పట్టుదలతో బీటెక్ డిగ్రీ ని సైతం మధ్యలోనే ఆపివేశాడు. తేలియా రుమల్ డిజైన్ తో రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం దగ్గిన గుర్తింపుతో భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేస్తాం అంటున్నాడు. జాతీయస్థాయిలో యంగ్ వీవర్ పురస్కారం సాధించిన పవన్ ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది మురుము చేతుల మీదుగా పురస్కారం అందుకోబోతున్నాడు. ఏడాది భారతీయ టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ జాతీయ పురస్కారం 2024 ప్రకటించేది. చేనేత అంటే పొట్టకూటి కోసం చేసే ఉపాధి కాదు , ఇది భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను చాటే కళ్ళ అని నిరూపించాడు పవన్. వస్త్రాలు నేయడంలో ఆధునిక సౌకర్యాలతో పాటు ఆధునీకతను జోడించి, రకరకాల ప్రయోగాలను చేస్తూ, నైపుణ్యం సంపాదించడంతో గూడ పవన్ జాతీయ యువ చేనేత పురస్కారానికి ఎంపికయ్యాడు.
డిజైనర్ గా స్టేట్ అవార్డు…
జాతీయ యువ చేనేత పురస్కారం అవార్డుతో పాటుగా రాష్ట్రస్థాయిలో
పుట్టపాక జాతీయ అవార్డుల పుట్ట….

యాదాద్రి భువనగిరి జిల్లాలోని పుట్టపాక గ్రామం అంటే పట్టుచీరలను సహజ సిద్ధరంగులతో జాతీయ రాష్ట్ర స్థాయి అవార్డులను సొంతం చేసుకోవడంలో అవార్డుల పుట్టగా పేరుంది. ఈ గ్రామానికి రెండు పద్మశ్రీ అవార్డులు, 10 జాతీయ అవార్డులు, 20 కి పైగా రాష్ట్రస్థాయి అవార్డులు దక్కించుకోవడంతో జాతీయ స్థాయిలో ఈ గ్రామానికి ప్రత్యేకత చోటుచేసుకుంది.
జాతీయ అవార్డుకు ఎంపికైన గూడ పవన్… పుట్టపాక గ్రామానికి చెందిన గూడ పవన్ గ్రామానికి ఉన్న ప్రత్యేకతతో పూర్తిగా తీసుకొని రాష్ట్రస్థాయిలో అవార్డును అందుకున్నారు. ఈనెల 7వ తేదీన ఢిల్లీలోని నేషనల్ అవార్డును రాష్ట్రపతి ద్రౌపతి మురుముచేతుల మీదుగా న్యూఢిల్లీలోని భారత్ కళ్యాణ మండపంలో అందుకోబోతున్నారు.

డిజైనర్ గా స్టేట్ అవార్డు…
జాతీయ యువ చేనేత పురస్కారం అవార్డుతో పాటుగా రాష్ట్రస్థాయిలో
డిజైనర్ గా అవార్డును చేనేత, జోళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్ చేతుల మీదుగా తెలంగాణ స్టేట్ అవార్డును అందుకున్నారు. డిజైనర్ గా అవార్డును చేనేత, జోళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్ చేతుల మీదుగా తెలంగాణ స్టేట్ అవార్డును అందుకున్నారు.

మార్కెటింగ్ గ్రామంలో నర్మదకు జాతీయ స్థాయి అవార్డు…
పుట్టపాక గ్రామానికి చెందిన నర్మదా తాను కేంద్ర కుటుంబంలోనే పుట్టిన అందరిలా చేనేత వృత్తిపై ఆధారపడకుండా , తమ కులవృత్తుల మీద ఆధారపడ్డ వారి జీవన విధానంలో మార్పు తీసుకురావాలి అని వారిని ఉన్నత శిఖరాలకు చేర్చాలి అన్న తపన ఆమె ఈ మార్కెటింగ్ వైపుకు మరల్చింది. చిన్న షాపుతో మొదలైన ఈమె వ్యాపారం గ్రామాల్లో చేనేత కార్మికులు నేసిన చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలి అప్పుడే వారికి చీరలు నేసే అవకాశం దక్కుతుందని 2013 సంవత్సరంలో పది లక్షలతో మొదలుపెట్టిన ఈ వ్యాపారం చిన్నచిన్నగా పెద్దదిగా మారి చివరికి ఇప్పుడు 8 కోట్ల టర్నవర్ కు వరకు చేరింది. చేనేత వృత్తిపై ఆధారపడి జీవించే వారికి అవకాశం కల్పిస్తూ సుమారు 300 మంది కుటుంబాలు తయారు చేసే చీరలను తమ వ్యాపార లావాదేవీల ద్వారా నిర్వహిస్తుంది. దేశంలో ఢిల్లీ, బెంగళూరు, ముంబై, కోల్కత్తా, ఇలా చాలా నగరాలు ఇక్కత్ చీరలను విక్రయిస్తుంది. ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్లను తీసుకొని చీరలను విక్రయించడం చేస్తుండడంతో మార్కెటింగ్ విభాగంలో ఇచ్చే జాతీయ పురస్కారాన్ని నర్మదకు కేటాయించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని గ్రామానికి ఈసారి రెండు జాతీయ పురస్కారాలు రావడం గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పలువురు తమ కులవృత్తిని ఈ విధంగా నలదిక్కుల వ్యాపించేలా చేసినందుకు సన్మానిస్తున్నారు.
జాతీయస్థాయిలో ఇద్దరు, రాష్ట్రస్థాయిలో ఐదుగురు ఎంపిక… చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస్… జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జాతీయస్థాయిలో రెండు అవార్డులు పుట్టపాక గ్రామానికి వచ్చాయని అందులో ఒకరు డిజైనింగ్ రంగంలో గూడ పవన్, మార్కెటింగ్ రంగంలో నర్మదకు కేటాయించడం జరిగిందన్నారు. గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డులను అందుకొని ఉన్నట్లు తెలిపారు.

కాగా రాష్ట్రస్థాయిలో కూడా ఐదుగురిని ఎంపిక చేసినట్లు తెలిపారు. అందులో కూడా పవన్ డిజైనర్ రంగంలో, మిగతా నలుగురు వీవర్ లో ఇచ్చినట్లు తెలిపారు. కొలను శంకర్ పోచంపల్లి సిల్క్,, లెనిన్, డబుల్ ఇక్కత్ చీరల తయారీ విభాగంలో, శ్యామల భాస్కర్ పోచంపల్లి ఇక్కత్ శారీస్ విభాగంలో, మంగళపల్లి శ్రీహరి పోచంపల్లి ఇక్కత్ శారీస్, చెల్ల మల్ల కృష్ణ తెలియ రుమల్ డబుల్ ఇక్కత్ సారీస్ విభాగంలో రాష్ట్ర స్థాయి అవార్డులకు ఎంపిక చేసినట్లు గురువారం రోజున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతులమీదుగా అవార్డును అందుకోనున్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -