Monday, October 6, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీ మెట్రోలో డిష్యూం డిష్యూం

ఢిల్లీ మెట్రోలో డిష్యూం డిష్యూం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఢిల్లీ మెట్రోలో ఇద్దరు ప్రయాణికులు డబ్ల్యూడబ్ల్యూఈ తరహాలో ఫైటింగ్‌కు దిగారు. కిక్కిరిసి వెళ్తున్న కోచ్‌లో సడన్‌గా ఇద్దరు ప్యాసింజర్స్ కొట్లాటకు దిగారు. ఢిల్లీ మెట్రోలో ప్రయాణం చేస్తుండగా ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అంతలోనే ఒకరికొకరు భౌతికదాడులకు దిగారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను సహచర ప్రయాణికుడు మొబైల్‌లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియోలో ఇద్దరు తన్నుకోవడం కనిపించింది. అనంతరం కొందరు ప్రయాణికులు సర్థిచెప్పి విడదీశారు. అయితే దుర్భాషలాడడంతోనే ఈ గొడవకు కారణమైనట్లుగా తెలుస్తోంది. కోపంతో తన్నినట్లుగా సమాచారం. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -