Saturday, October 25, 2025
E-PAPER
Homeఆదిలాబాద్రాష్ట్ర కమిటీలో జిల్లా నుండి ఇద్దరికి చోటు

రాష్ట్ర కమిటీలో జిల్లా నుండి ఇద్దరికి చోటు

- Advertisement -

రాష్ట్ర సహాయ కార్యదర్శిగా బొజ్జన్న ఏకగ్రీవం
రాష్ట్ర కమిటీ సభ్యునిగా రొడ్డ ఇంద్రజ 
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభల్లో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర కమిటీకి ఎన్నికయ్యారు. గత నెల అక్టోబర్ 24,25 తేదీలలో మహబూబాబాద్ లో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర 5వ మహాసభలు నిర్వహించారు. ఈ మహాసభల్లో ఆదిలాబాద్ జిల్లా నుండి తొమ్మిది మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ మహాసభల్లో గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా కార్యదర్శి బొజ్జ ఆశన్న రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర కమిటీ సభ్యులుగా గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్షులు రొడ్డ ఇంద్రజ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా గ్రామపంచాయతీ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బొజ్జ ఆశన్న మాట్లాడుతూ… గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పైన జిల్లాలో అనేకమంది కార్మికులు మల్టీపర్పస్ విధానం వల్ల విద్యుత్ షాక్ వల్ల మంది మరణించారన్నారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని జీవో నంబర్ 51 సవరించాలని రాష్ట్ర మహాసభల్లో తీర్మానం చేశారు. యూ తీర్మానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకునే అంతవరకు   జిల్లాలో గ్రామపంచాయతీ కార్మికులు పోరాటం చేస్తారని డిమాండ్ చేశారు  ఈ మధ్యకాలంలో గ్రామపంచాయతీ కార్మికులు అనేక కారణాలు వల్ల మరణించారని వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సుమారుగా జిల్లాలో 70 మంది కార్మికులు ఆన్లైన్ పేరు నమోదు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.

ఆన్లైన్ కానీ పక్షంలో వారికి వచ్చేటువంటి వేతనాలు 6 నుండి 7 నెలల వేతనాలు ఇప్పటివరకు వారి ఖాతాల్లో జమ చేయడం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికులు ఆన్లైన్ సమస్య వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని డిపిఓ కు ఆన్లైన్ అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మల్టీపర్పస్ విధానాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని అన్నారు. ఈ గ్రామపంచాయతీ యూనియన్ రాష్ట్ర మహాసభల్లో జిల్లా ప్రతినిధులు గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా కోశాధికారి సుంచు రవి ఉపాధ్యక్షులు రామక్క, వర్ణ, జిల్లా సహాయ కార్యదర్శి కిరణ్, గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా నాయకులు  గంగన్న, లక్ష్మన్న హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -