Thursday, July 31, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకెనడాలో రెండు విమానాలు ఢీ.. కేర‌ళ యువ ఫైల‌ట్ మృతి

కెనడాలో రెండు విమానాలు ఢీ.. కేర‌ళ యువ ఫైల‌ట్ మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కెనడాలో రెండు శిక్ష‌ణ విమానాలు ఢీకొన్నాయి. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు యువ ఫైల‌ట్లు మ‌ర‌ణించారు. ఒకరు భారత సంతతికి చెందిన 23 ఏళ్ల విద్యార్థి అని టొరంటోలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. అతడు కేరళకు చెందిన శ్రీహరి సుకేశ్‌గా వెల్లడించింది. మరణించిన మరో పైలట్‌ 20 ఏళ్ల కెనడియన్‌ పౌరుడు సవన్నా మే రోయెస్‌గా గుర్తించారు.

సుకేశ్‌ కొచ్చిలోని త్రిప్పునితురలో గల స్టాట్యూ న్యూ రోడ్‌ నివాసి. అతడు హార్వ్స్‌ ఎయిర్‌ పైలట్‌ శిక్షణ స్కూల్‌ (Harvs Air pilot training school)లో శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే, మంగళవారం తెల్లవారుజామున టేకాఫ్‌, ల్యాండింగ్‌లను ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు శిక్షణ స్కూల్‌ అధ్యక్షుడు ఆడమ్‌ పెన్నర్‌ తెలిపారు. ఒకే సమయంలో ల్యాండ్‌ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -