Thursday, July 24, 2025
E-PAPER
Homeజాతీయంఇద్దరు జైలు అధికారులపై సస్పెన్షన్ వేటు

ఇద్దరు జైలు అధికారులపై సస్పెన్షన్ వేటు

- Advertisement -

నవతెలంగాణ – అమరావతి: ఏపీలో ఇద్దరు జైలు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. డిప్యూటీ సూపరింటిండెంట్ రమేశ్, జైలర్ రఫీ అనే ఇద్దరు జైలు అధికారులను సస్పెండ్ చేస్తూ జైళ్ల శాఖ డీజీ ఉత్తర్వులు జారీ చేశారు. జైలర్ రఫీ ఇటీవలే కడప నుంచి అనంతపురం జైలుకు బదిలీ అయ్యారు. అయితే, ఓ ఎర్రచందనం స్మగ్లర్ కు సెల్ ఫోన్లు ఇచ్చారని ఈ ఇద్దరు అధికారులపై ఆరోపణలు వచ్చాయి. ఇవే ఆరోపణలతో నిన్న ఐదుగురిని సస్పెండ్ చేశారు. కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ నివేదిక ఆధారంగా జైళ్ల శాఖ డీజీ ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో స్మగ్లర్ జాకీర్ నుంచి జైలు అధికారులు 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కడప రిమ్స్ పోలీసులకు ఫిర్యాదు చేసి 3 ఫోన్లు అప్పగించారు. కాగా, ఈ వ్యవహారంలో కడప జైలులో డీఐజీ రవికిరణ్ విచారణ కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -