- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రకాశం జిల్లా దోర్నాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లమల్ల ఘాట్ రోడ్డులో రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఓ బస్సు డ్రైవర్ కేబిన్‌లో చిక్కుకుపోయారు. క్షతగాత్రులందరినీ ఆస్పత్రికి తరలించారు. క్రేన్ సాయంతో రెండు బస్సులను పక్కకు తీశారు.
ఈ ప్రమాదంతో శ్రీశైలం వైపు 10 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ప్రస్తుతం ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- Advertisement -