Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుబాన్సువాడకు రెండు ఆర్టీసీ బస్సులు 

బాన్సువాడకు రెండు ఆర్టీసీ బస్సులు 

- Advertisement -

బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం
నవతెలంగాణ – నసురుల్లాబాద్ 

బాన్సువాడ ఆర్టీసీ డిపోకు కెటాయించిన రెండు కొత్త ఎక్స్ ప్రెస్ బస్సు సర్వీసులను బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్ సరితా దేవి కలసి బస్సులను ప్రారంభించారు. శనివారం బాన్సువాడ ఆర్టీసీ బస్సు డిపోలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రెండు ఆర్టీసీ బస్సులను నిజామాబాద్ నుండి జహీరాబాద్, (వయా బోధన్, బాన్సువాడ, నిజాంసాగర్), మరొక్క బాన్సువాడ నుండి నారాయణఖేడ్ (వయా పిట్లం, నిజాంపేట్) సర్వీసు బస్సులను నేడు డిపో వద్ద జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో మహాలక్ష్మీ పథకం అమల్లోకి తెచ్చి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో.. మహిళలు, విద్యార్థినుల ప్రయాణాలు బాగా పెరిగాయని, మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీని తగ్గించేందుకు అందుబాటులో కొత్త బస్సులను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ డిపో మేనేజర్ శ్రీమతి ఆర్, సరిత దేవి, ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad