Tuesday, March 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెండు ఇసుక ట్రాక్టర్ పట్టివేత

రెండు ఇసుక ట్రాక్టర్ పట్టివేత

- Advertisement -

నవతెలంగాణ-పెద్దవంగర
ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్ తెలిపారు. మండలంలోని పోచారం గ్రామంలో మంగళవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామ కర్నాలకుంట తండాకు చెందిన బానోత్ గోపాల్, మండలంలోని రెడ్డికుంట తండాకు చెందిన బానోత్ యాకుబ్ లు ఇద్దరూ అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు.

ఇసుకకు సంబంధించిన ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని, పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.‌ ఈ మేరకు ఎస్సై మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతలను కాపాడేందుకు నిరంతరం నిఘా పెంచినట్లు తెలిపారు. అక్రమ రవాణా, మద్యం విక్రయాలు, జూదం వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -