ఎన్నికల ధ్రువీకరణ పత్రాలు అందజేసిన రిటర్నింగ్ అధికారులు
హాజరైన కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్
నవతెలంగాణ – మల్హర్ రావు
2వ స్థానిక ఎన్నికల్లో భాగంగా మండలంలో మొత్తం15 పంచాయతీలకు గాను చిన్నతూండ్ల, దుబ్బపేట గ్రామాల సర్పంచ్ లు, గడ్డం క్రాoతి,భూక్య రవిందర్ నాయక్, ఇద్దరు ఉప సర్పంచ్ లు, 26 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మిగిలిన 13 సర్పంచ్ పదవులకు 42 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మండలంలో 128 వార్డు సభ్యులకు గాను 26 స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 102 వార్డు సభ్యుల పదవుల కోసం 237 మంది పోటీ పడుతున్నారు. అయితే ఏకగ్రీవంగా ఎన్నికైన ఇద్దరు సర్పంచ్ లు, 26 మంది వార్డు సభ్యులకు బుధవారం ఎన్నికల ధ్రువీకరణ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అందజేశారు. ఈ కార్యక్రమానికి కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్,ఎంపిడిఓ క్రాoతి కుమార్, సూపర్ డెంట్ మూర్తి,ఎంపిఓ విక్రమ్ కుమార్, పంచాయతీ కార్యదర్శులు,రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.
మల్హర్ లో రెండు సర్పంచ్ లు, 26 వార్డులు ఏకగ్రీవం.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



