- Advertisement -
మౌనమూ మాట
నాణానికి రెండు ముఖాలు
అవును కాదు
రెండు భావాలు
రెండు ద్వారాలు
నేను దుఃఖం ఖజానా
అంచున నిలబడి వున్నాను
సంతోషం తిజోరీ తెరవడానికి
తాళం చెవులు నా దగ్గర లేవు
ఎట్లా చెప్పను
ప్రేమించినప్పుడు ఇష్టపడ లేదు
ఇష్టపడ్డప్పుడు ప్రేమించ లేదు
దేహమూ మనసూ
ఒకదానిలో ఒకటి
ఒకటీ కాదు వేరూ కాదు
ఒకటి తేలితే
మరోటి మునుగుతుంది
– వారాల ఆనంద్, 9440501281
- Advertisement -