నవతెలంగాణ -ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లోని సాయి మాధవ్ నగర్ కాలనీలో సోమవారం మధ్యాహ్నం సమయంలో సాయినాథ్ కు చెందిన ఇంట్లో దొంగతనం జరిగింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం… బాధితుడు సాయినాథ్ తనఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం వేరే గ్రామానికి వెళ్లారు .అయితే మధ్యాహ్నం వేళలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసును దొంగలించారు. మధ్యాహ్నం 3.30గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చిన బాధితుడు కుటుంబ సభ్యులు చూడగా తలుపులు తెరిచి ఉన్నాయి. దీంతో దొంగతనం జరిగినట్లు విషయాన్ని వెంటనే గ్రహించి ముధోల్ పోలీసులకు సమాచారం అందించారు ..ఈ విషయం తెలుసుకున్న ముధోల్ సిఐ మల్లేష్, ఎస్సై బిట్ల పెర్సెస్ లు హుటాహుటిన సంఘటన జరిగిన ఇంటిని పరిశీలించారు. పలు వివరాలను బాధితుడు నుండి అడిగి తెలుసుకున్నారు. బంగారు గొలుసు విలువ సుమారు.రూ.2లక్ష ల వరకు ఉంటుందని బాధితుడు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు.
ముధోల్ లో రెండు తులాల బంగారం చోరి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES