Tuesday, December 9, 2025
E-PAPER
Homeక్రైమ్ఇద్దరు ద్విచక్ర వాహన దొంగల అరెస్టు 

ఇద్దరు ద్విచక్ర వాహన దొంగల అరెస్టు 

- Advertisement -

ఐదు వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

నగరంలోని ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న మోటార్ సైకిల్ చోరీలను అరికట్టేందుకు టౌన్–I పోలీసులు ప్రత్యేక పహారా  పర్యవేక్షణ చేపట్టారు. దర్యాప్తు వేగవంతం చేసి ఇద్దరు దొంగలను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 5 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రఘుపతి మంగళవారం తెలిపారు. ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం— సీసీ కెమెరా ఫుటేజీలు, టెక్నికల్ ఎవిడెన్స్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకున్నారు. స్వాధీనం చేసిన బైక్లు కేసులకు సంబంధించినవని నిర్ధారించారు.

నిజాంబాద్ జిల్లా బోధన్ డివిజన్ లోని రాకాసిపేటకు చెందిన అమీర్ ఖాన్, కామారెడ్డి జిల్లా అడ్లూరు గ్రామానికి చెందిన మహమ్మద్ హనీఫ్ లను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు.ఆస్తి నేరాలను అరికట్టేందుకు పహారా, పర్యవేక్షణ, ప్రత్యేక దర్యాప్తు చర్యలను మరింత బలోపేతం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వాహనాలకు పటిష్టమైన లాక్స్ ఉపయోగించాలని, అనుమానాస్పద వ్యక్తులు గమనించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -