Saturday, November 1, 2025
E-PAPER
Homeసినిమా'అగ్లీ స్టోరీ' రిలీజ్‌కి రెడీ

‘అగ్లీ స్టోరీ’ రిలీజ్‌కి రెడీ

- Advertisement -

నందు, అవికా గోర్‌ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘అగ్లీ స్టోరీ’. రియా జియా ప్రొడక్షన్స్‌ పతాకం మీద సీహెచ్‌ సుభాషిణి, కొండా లక్ష్మణ్‌ నిర్మించగా, ప్రణవ స్వరూప్‌ దర్శకత్వం వహించారు.
ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టైటిల్‌ గ్లింప్స్‌, టీజర్‌, పాటలకు మంచి స్పందన లభించింది. కాగా ఈ చిత్రం ఈనెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
‘రొమాంటిక్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రానున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తుందనే నమ్మకం ఉంది. ఇందులో నందు, అవికాగోర్‌ నటన మెస్మరైజ్‌ చేస్తుంది’ అని మేకర్స్‌ తెలిపారు. రవితేజ మహాదాస్యం, శివాజీ రాజా, ప్రజ్ఞా నయన్‌ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి ప్రొడ్యుసర్‌ : సుభాషిని, కొండా లక్ష్మణ్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ప్రణవ స్వరూప్‌, సహ నిర్మాతలు : రాజ్‌ నాగ్‌, అశ్విని శ్రీకృష్ణ కెమెరా: శ్రీసాయికుమార్‌ దారా, ఎడిటింగ్‌ : శ్రీకాంత్‌ పట్నాయక్‌, సంగీతం: శ్రవణ్‌ భరద్వాజ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ : విఠల్‌ కోసనం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -