Tuesday, November 4, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంపెట్రోకెమికల్‌ ప్లాంట్‌పై ఉక్రెయిన్‌ దాడి

పెట్రోకెమికల్‌ ప్లాంట్‌పై ఉక్రెయిన్‌ దాడి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: రష్యాలోని స్టెర్లిటామాక్‌ పెట్రోకెమికల్‌ ప్లాంట్‌పై ఉక్రెయిన్‌ దాడికి దిగింది. ఈ దాడిలో ప్లాంట్‌ పాక్షికంగా కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. అయితే ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని వెల్లడించారు. ఆసమయంలో ప్లాంట్‌లో ఐదుగురు కార్మికులు ఉన్నారని అన్నారు.

ఉరల్స్‌ పర్వతాల్లో ఉక్రెయిన్‌ సరిహద్దు నుండి సుమారు 1500కి.మీ దూరంలో ఉన్న బాష్కోర్టోస్టాన్‌ ప్రాంతంలోని ప్లాంట్‌పై దాడి జరిగిందని, అయితే ప్రస్తుతం అంతరాయం లేకుండా పనిచేస్తోందని బాష్కోర్టోస్తాన్‌ ప్రాంత అధ్యక్షులు రాడి ఖబిరోవ్‌ టెలిగ్రామ్‌ మెసేజింగ్‌ యాప్‌లో తెలిపారు. సోమవారం అర్థరాత్రి నుండి ఉక్రెయిన్‌ డ్రోన్లతో విరుచుకుపడిందని, ఈ ప్రాంతంలో రెండు డ్రోన్లను సైన్యం ధ్వంసం చేశాయని ఖబిరోవ్‌ తెలిపారు. బాష్కోర్టోస్తాన్‌ ప్రాంతంపై రెండు డ్రోన్లతో పాటు రష్యాలోని మరో ఏడు ప్రాంతాలపై దాడికి దిగిన 83 డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థ ఎదుర్కొందనిరష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఉక్రెయిన్‌ రష్యాపై దాడులను వేగవంతం చేసింది. దీర్ఘశ్రేణి డ్రోన్‌లు, మిసైల్స్‌తో చమురు శుద్ధి ప్లాంట్లు, డిపోలు, లాజిస్టిక్స్‌ హబ్‌లపై దాడికి దిగుతోంది. ఈ దాడులను ఉగ్రవాదపు చర్యగా రష్యా అభివర్ణించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -