- Advertisement -
నవతెలంగాణ న్యూయార్క్: వెనిజువెలాలో అమెరికా సైనిక చర్యలు, అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్ట్ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం జనవరి 5న న్యూయార్క్‌లో జరగనుంది. వెనిజువెలా ప్రభుత్వం దీనిని ‘అక్రమ ఆక్రమణ’గా ఖండించింది. ఈ సైనిక చర్యల చట్టబద్ధత, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనపై చర్చ జరగనుంది. రష్యా, చైనా, ఇరాన్ వెనిజువెలాకు మద్దతుగా నిలవనున్నాయి. అమెరికా దీనిని డ్రగ్ నియంత్రణ చర్యగా పేర్కొంది. లాటిన్ అమెరికా దేశాలు, ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
- Advertisement -



