ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై తల్లి ఆత్మహత్య
నవతెలంగాణ- కంది
భర్త మృతితో తీవ్ర కుంగు బాటుకు గురైన మహిళ.. ఇద్దరు చిన్నారుల గొంతునులిమి చంపేసి.. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంది మండలంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంది మండలం మక్త అల్లూరు గ్రామానికి చెందిన మమత(27)కు జూల్కల్ గ్రామానికి చెందిన పట్నం ప్రవీణ్‌తో వివాహం జరిగింది. వారికి మణికంఠ(5), ప్రణయశ్రీ(2) సంతానం. కాగా, జనవరి 5వ తేదీన ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. దీంతో మమత మానసికంగా కుంగిపోయింది.
శనివారం మధ్యాహ్నం అయినా ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారు అనుమానంతో బలవంతంగా తలుపులు తెరిచారు. మమత దూలానికి చీరతో ఉరేసుకుని విగతజీవిగా కనిపించింది. పక్కనే నేలపై ఇద్దరు పిల్లల మృతదేహాలు ఉన్నాయి. పిల్లల గొంతు భాగంలో గాయాలున్నాయి. భర్త మరణం వల్ల కలిగిన మానసిక బాధతో పిల్లలను గొంతు నులిమి చంపి, అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు. మృతురాలి తండ్రి బీర్ల శంకర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఎస్పీ పరితోష్ పంకజ్, సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్ పరిశీలించారు.
భర్త మృతిని తట్టుకోలేక..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



