Saturday, July 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలుభర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య

భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ-జక్రాన్ పల్లి 
భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు  ఎస్సై మాలిక్ రెహమాన్ తెలిపారు. మండలంలోని బాలానగర్ గ్రామానికి చెందిన గుంజ వెంకట్ కూతురు గుంజే అక్షయ (19) నెల రోజుల క్రితం, నిజామాబాద్, నాగారంకి చెందిన పల్లపు సునీల్ అనే వ్యక్తితో పెళ్లి అయింది. పెళ్లి అయిన వారం రోజుల నుండి సునీల్ అక్షయను శారీరకంగా వేదిస్తున్నాడంతో పుట్టింటికి వచ్చింది. ఈరోజు ఉదయం 11 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు వేసుకొని చనిపోయింది. మృతురాలి తండ్రి గుంజ వెంకట్ ఇచ్చిన దరఖాస్తు పై భర్త సునీల్ పై కేసు నమోదు చేసారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ హాస్పిటల్ కు తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -