Monday, December 8, 2025
E-PAPER
Homeజిల్లాలుఏకగ్రీవమైన రామమ్మపేట స‌ర్పంచ్

ఏకగ్రీవమైన రామమ్మపేట స‌ర్పంచ్

- Advertisement -
  • శాలువాలతో సన్మానించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

న‌వ‌తెలంగాణ‌-పెబ్బేరు: గ్రామానికి చెందిన పద్మమ్మ భర్త చిన్న రాయుడు రామమ్మపేట గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవమయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఏకగ్రీవ సర్పంచి పద్మమ్మను శాలువాలతో సన్మానించి అభినందించారు. రామమ్మపేట గ్రామం ఏకగ్రీవమైనందున తన ఎస్‌డిఎఫ్ నిధుల నుంచి 20 లక్షల రూపాయలను ఇస్తానని గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రామమ్మపేట గ్రామ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రంజిత్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, రాజశేఖర్ రెడ్డి, మధు, నాగేంద్రం, నారాయణరెడ్డి, లక్ష్మీనారాయణ, సత్య రెడ్డి, భాస్కర్ తోపాటు పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -