నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులపై మండల వ్యవసాయ అధికారిని మహేశ్వరి , ఎస్సై నవీన్ చంద్ర, ఎమ్మార్వో మారుతి బృందంగా ఏర్పడి ఫర్టిలైజర్ షాపుల నిల్వచేసే గోదాంలపై శనివారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా గోదాములలో నిల్వ ఉంచిన యూరియా సంచులను ఇతర ఫెర్టిలైజర్ రసాయనక ఎరువులను పరిశీలించారు. కృతిమంగా యూరియా కొరత సృష్టిస్తే కేసులు నమోదు అయితాయని అదేవిధంగా దుకాణాల లైసెన్సులు రద్దు చేయడం జరుగుతుందని దుకాణాల యజమానులకు తెలిపారు. స్టాక్ పొజిషన్, ధరలు, స్టాక్ పొజిషన్, పట్టికను బహిరంగంగా రైతులకు కనబడే విధంగా ఉంచాలని సూచించారు. ఇవే కాక పక్క రాష్ట్రాల నుండి మందులు తీసుకొని వచ్చి అమ్మ వద్దని తెలిపారు. ప్రతి రైతుకు బిల్లులు తప్పక ఇవ్వాలని పేర్లు నమోదు చేసుకొని ఆధార్ కార్డు ఆధారంగా రసాయన ఎరువులు రైతులకు ఇవ్వాలని సూచించారు. తనిఖీల కార్యక్రమంలో జుక్కల్ మండల వ్యవసాయ అధికారులు, ఎమ్మార్వో, ఎస్సై తదితరులు పాల్గొన్నారు.
ఫర్టిలైజర్ గోదాముల ఆకస్మిక తనిఖీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES