Wednesday, August 6, 2025
E-PAPER
Homeకరీంనగర్విద్యాలయాల ఆకస్మిక తనిఖీ..

విద్యాలయాల ఆకస్మిక తనిఖీ..

- Advertisement -

నవతెలంగాణ – తంగళ్ళపల్లి
తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను బుధవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లో పాఠ్యాంశాల బోధనను పరిశీలించారు. ప్రతి విద్యార్థితో ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, ఇతర పాఠ్యాంశాలు నిత్యం చదివించాలని, రాయించాలని, పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలని, సమస్యల పరిష్కారంపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.
గ్యాస్ కనెక్షన్ అందుబాటులోకి…
జిల్లాలోని అన్ని విద్యాలయాల్లో మధ్యాహ్న భోజనం సిద్ధం చేసేందుకు గ్యాస్ కనెక్షన్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంజూరు చేస్తున్నారు. ఇందులో భాగంగా చీర్లవంచ గ్రామంలోని పాఠశాలకు గ్యాస్ కనెక్షన్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా దానిని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, కే కే మహేందర్ రెడ్డి కలిసి ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -