Thursday, January 8, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ముధోల్ లో అండర్-23  క్రికెట్ జోనల్ పోటీలు ప్రారంభం

ముధోల్ లో అండర్-23  క్రికెట్ జోనల్ పోటీలు ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్ 
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జోనల్ అండర్ 23 క్రీడా పోటీలు మంగళవారం ప్రారంభం అయ్యయి. స్థానిక ఉన్నత పాఠశాల మైదానంలో క్రికెట్ పోటీలను తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరుపున నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే యెండేల లక్ష్మీనారాయణ, ఎస్ఐ బిట్ల పెర్సిస్, స్థానిక సర్పంచ్ షబానా ఎజాజోద్దిన్ , తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు బాజీరావు లు ప్రారంబించారు. ఈసందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతు క్రీడా పోటీలు మానసిక ఉల్లాసం ను కలిగిస్తాయన్నారు.

క్రీడా పోటీల వల్ల పోటీతత్వం పెరుగుతుందన్నారు. క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయని అన్నారు. ఈ సందర్భంగా మొదటి మ్యాచ్ అదిలాబాద్ , మంచిర్యాల టీంలు పోటీపడ్డాయి. ఈకార్యక్రమంలో క్రికెటర్ నయీముద్దీన్, కార్యదర్శి తుమ్మేల్ల దత్తు , బిజెపి మండల అధ్యక్షులు కోరిపోతన్న, ఉపసర్పంచ్ లావణ్య సాయినాథ్,మాజీ ఎంపీటీసీ మగ్దుమ్ , టిసిఏ అభయ్ పటేల్ , ముధోల్ నియోజకవర్గం మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు రోల్ల రమేశ్ , నాయకులు మదన్ మోరే , సాయి, ధర్మపురి శ్రీనివాస్ ,దశరత్ , జిందంవార్ వెంకటేష్ , ఇమ్రాన్ ఖాన్, తదితరులు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -