కార్యక్రమం రాష్ట్ర డైరెక్టర్ సలీం
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
నిజామాబాద్ పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో ఉదయం 12 గంటల 30 నిమిషాలకు సమాచార హక్కు చట్టం 2005 పైన అవగాహన కార్యక్రమం, నిజామాబాద్ జిల్లా కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ మాజీ పేరు ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి ఎంఏ సలీం ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా కాంతపు గంగాధర్, మహిళ అధ్యక్షురాలుగా వై సునీత న్యాయ విభాగ సలహాదారులుగా శ్యామల నిజామాబాద్ జిల్లా కార్యదర్శిగా రషీద జిల్లా ముఖ్య సలహాదారులుగా మహమ్మద్ , బోధన్ డివిజన్ అధ్యక్షురాలిగా తస్లీమ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అనంతరం సమాచార హక్కు చట్టం 2005 పేద ప్రజలకు ఒక వజ్రాయుధం లాంటిదని సలీం అన్నారు. సందర్భంగా రాష్ట్ర స్పోక్స్ పర్సన్ న్యాయవాది శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు బోర్డులను ఏర్పాటు చేసి అధికారులకు శిక్షణ తరగతులు ఇచ్చి కాళేశ్వరం తదితర అవినీతిలు జరిగిన ఆరోపణలపై దర్యాప్తు చేసి తగిన సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. సమాచార హక్కు చట్టం 2005 పరిధిని అంతర్జాతీయ స్థాయిలో విస్తరించాలని ఇక శ్రీనివాసరావు న్యాయవాది కోరారు.
అలాగే సమాచార హక్కు చట్టం 2005 దరఖాస్తు విధానాన్ని సెక్షన్ 6(1) మరియు సెక్షన్ 19(1) రెండవ పి ల్ 19 (3 )మరియు సమాచారాన్ని ఇవ్వని అధికారులపై రాష్ట్ర కమిషన్కు ఫిర్యాదు చేసినచో ప్రతిరోజు 250/- చొప్పున 25 వేల వరకు జరిమానా విధించే అధికారం రాష్ట్ర సమాచార కమిషన్ కు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు కాంతపూ గంగాధర్ మహిళా అధ్యక్షురాలు వై సునీత న్యాయ విభాగ సలహాదారులు శ్యామల జిల్లా మహిళా కార్యదర్శి రషీద బోధన్ డివిజన్ అధ్యక్షురాలు తస్లీమ్ సహచట ప్రతినిధులు జాబిద్ అన్వర్ గౌరీ శ్రీనివాస్ టీ నరసింహ చారి ఆవేద సేం, వందన తదితరులు పాల్గొన్నారు.
సమాచార హక్కు చట్టం 2005 పై అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES