- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: సిరిసిల్లలో ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎలాంటి ఉద్యోగం లభించడంలేదని మనస్తాపంతో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. గంభీరావుపేట మండలం నర్మల గ్రామానికి చెందిన లోకం శ్రీకాంత్(25) ఉన్నత చదువులు పూర్తి చేశాడు. ఆ తర్వాత ప్రయివేటు ఉద్యోగాల కోసం కొన్ని నెలల తరబడి పలు కంపెనీల చుట్టు తిరిగినా ఫలితం లేకపోవడంతో నిరాశతో చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -