Wednesday, December 10, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయం‘దీపావ‌ళికి’ యునెస్కో గుర్తింపు

‘దీపావ‌ళికి’ యునెస్కో గుర్తింపు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: భార‌తీయ సాంప్ర‌దాయంలో భాగంగా ప్ర‌ధాన పండ‌గ‌ల్లో ఒక‌టైన దీపావ‌ళికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. యునెస్కో(UNESCO) తన ‘మానవజాతి యొక్క అరూప సాంస్కృతిక వారసత్వ ప్రాతినిధ్య జాబితా లో చేర్చింది. ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా జరుగుతున్న యునెస్కో అంతర ప్రభుత్వ కమిటీ యొక్క 20వ సమావేశంలో ఈ చారిత్రక నిర్ణయాన్ని డిసెంబర్ 10న ప్రకటించారు. దీంతో, యోగా, దుర్గా పూజ, కుంభమేళా వంటి వాటి తర్వాత యునెస్కో జాబితాలో చేరిన 16వ భారతీయ సంప్రదాయంగా దీపావళి నిలిచింది. యునెస్కో గుర్తింపు ద్వారా ఈ పండుగ ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం మరింత పెరగడంతో పాటు, దీనిని భవిష్యత్ తరాల కోసం ‘జీవన వారసత్వం’గా పరిరక్షించాల్సిన బాధ్యత పెరుగుతుందని పీఎం మోడీ స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -