Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడీ చిన్నారులకు యూనిఫామ్స్..!

అంగన్వాడీ చిన్నారులకు యూనిఫామ్స్..!

- Advertisement -
  • – మండల వ్యాప్తంగా 1,194 మంది పిల్లలు
    నవతెలంగాణ-మల్హర్ రావు

    అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుంది.అందులో భాగంగా ఆరేళ్లలోపు చిన్నారులకు యూనిఫామ్స్ అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే జిల్లా సంక్షేమాధికారి కార్యాలయానికి యూనిఫామ్ క్లాథ్ ను సరఫరా చేసింది.మండల పరిధిలో 38 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో 1,194 మంది పిల్లలు చదువుతున్నారు. గతేడాది 30 శాతం చిన్నారులకే యూని ఫామ్స్ రాగ, ఈ ఏడాది మాత్రం100శాతం పిల్ల లకు పంపిణీ చేసేందుకు క్లాథ్ ను సిద్ధం చేశారు.ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున పిల్లల కొలతల ఆధారంగా కుట్టించి త్వరలోనే పంపిణీ చేయనున్నారు. ఐతే ఈ సంవత్సరం చీరల రంగులు మారాయి. మండలంలో 30 అంగన్వాడీ టీచర్లు, 30 మంది ఆయాలు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున చీరలు, బ్లౌజులు అందజేశారు.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad