Friday, December 5, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅంత‌రాయంలేకుండా భార‌త్‌కు ఇంధ‌నం స‌ర‌ఫ‌రా: పుతిన్

అంత‌రాయంలేకుండా భార‌త్‌కు ఇంధ‌నం స‌ర‌ఫ‌రా: పుతిన్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతున్న‌ భారత ఆర్థిక వ్యవస్థ కోసం రష్యా ఎలాంటి అంత‌రాయం లేకుండా ఇంధనాన్ని రవాణా చేయడానికి సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన పుతిన్, ఈ రోజు(డిసెంబర్ 5) సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే ఆరు రియాక్టర్లలో రెండింటిని గ్రిడ్‌లో అనుసంధానించామని, మరో నాలుగు నిర్మాణంలో ఉన్నాయని అన్నారు. అంతేకాకుండా వైమానిక రక్షణ, వాయుసేన, నౌకాదళ రంగాల్లో భారతదేశానికి అత్యాధుని సాంకేతికత అందిస్తున్నామని చెప్పారు.

ఇది భారత దేశానికి తక్కువ ఖర్చుతో క్లీన్ ఎనర్జీని ఇస్తుందని చెప్పారు.భారత్ రష్యా వాణిజ్యంలో 96 శాతం రూపీ-రూబుల్ ద్వారా జరుగుతోందని, త్వరలో యూరేసియన్ ఎకనామిక్ యూనియన్-భారత్ ప్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరే అవకాశం ఉందని పుతిన్ అన్నారు. వచ్చే ఏడాది భారత్ బ్రిక్స్ అధ్యక్ష పదవి చేపడుతోందని, భారతీయ స్నేహితులకు అవసరమైన అన్ని సహాయాలను అందిస్తామని పుతిన్ చెప్పారు.

భారతదేశంలో అతిపెద్ద అణు కర్మాగారాన్ని నిర్మించే ప్రాజెక్టుపై కూడా రష్యా పనిచేస్తోందని, తమిళనాడులోని కడంకుళం అణు విద్యుత్ కేంద్రం గురించి మాట్లాడారు. గతేడాది ఇరు దేశాల మధ్య వాణిజ్య టర్నోవర్ 12శాతం పెరిగిందని ఇది 64 బిలియన్ డాలర్లు అని, దీనిని 100 బిలియన్ డాలర్లకు పెంచేందుకు రెండు దేశాలు కృషి చేస్తున్నాయని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -