- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయల్ ఓరం సమ్మక్క సారలమ్మ జాతరకు హాజరు కానున్నారు. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జాతర గురించి వివరించి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన గురువారం హెలిప్యాడ్ ద్వారా ఉదయం మేడారానికి చేరుకుంటారు. అక్కడ నుంచి జుయల్ ఓరంను రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెంట పెట్టుకుని దేవస్థానానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు.
- Advertisement -



