Wednesday, October 1, 2025
E-PAPER
Homeసినిమాయూనిక్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌

యూనిక్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌

- Advertisement -

విష్ణు విశాల్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆర్యన్‌’. డార్క్‌ అండ్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శుభ్ర, ఆర్యన్‌ రమేష్‌తో కలిసి విష్ణు విశాల్‌ స్టూడియోస్‌ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ప్రవీణ్‌ కె దర్శకత్వం వహించారు. అక్టోబర్‌ 31న ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు భాషలలో విడుదల కానున్న ఈ చిత్ర టీజర్‌ మంగళవారం విడుదలైంది. ఒక థ్రిల్లింగ్‌ హత్య దర్యాప్తు, విష్ణు విశాల్‌ పాత్రను ఆసక్తికరంగా పరిచయం చేస్తూ ఈ టీజర్‌ ప్రేక్షకులను డార్క్‌ అండ్‌ ఇంటెన్స్‌ వరల్డ్‌ని తీసుకెళుతుంది. తనదైన శైలిలో విభిన్నమైన పాత్రతో విష్ణు విశాల్‌ ఆకట్టుకున్నారు. 34 నెలల విరామం తర్వాత విష్ణు విశాల్‌ ఈ శక్తివంతమైన టీజర్‌తో సోలో లీడ్‌గా కమ్‌ బ్యాక్‌ ఇచ్చారు.

‘రాట్ససన్‌’ విజయం తర్వాత, విష్ణు విశాల్‌ మరోసారి ‘ఆర్యన్‌’లో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో సెల్వరాఘవన్‌, శ్రద్ధా శ్రీనాథ్‌, మానస చౌదరి కీలక పాత్రల్లో నటించగా, సాయి రోనక్‌, తారక్‌ పొన్నప్ప, మాల పార్వతి, అవినాష్‌,అభిషేక్‌ జోసెఫ్‌ జార్జ్‌ తదితరులు ఇతర పాత్రలను పోషించారు. ఒక యూనిక్‌ ఇన్వెస్టిగేటివ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా దర్శకుడు ప్రవీణ్‌ కె దీన్ని తెరకెక్కించారు అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి డీఓపీ- హరీష్‌ కన్నన్‌, సంగీతం – జిబ్రాన్‌, ఎడిటర్‌ – శాన్‌ లోకేష్‌. స్టంట్స్‌ – స్టంట్‌ సిల్వా, పిసి స్టంట్స్‌ ప్రభు, ఎడిషల్‌ స్క్రీన్‌ ప్లే – మను ఆనంద్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌ – ఎస్‌.జయచంద్రన్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -