Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంయునైటెడ్ క్రిస్టియన్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక 

యునైటెడ్ క్రిస్టియన్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక 

- Advertisement -

అధ్యక్షులుగా బిజ్ఞాన రావు
నవతెలంగాణ – మణుగూరు
మణుగూరు మండల యునైటెడ్ క్రిస్టియన్ అసోసియేషన్ (ఎంఎంయుసిఎ) 2025-27 నూతన  కార్యవర్గ ఎన్నికలు బుధవారం సంఘ సభ్యుల సమక్షంలో  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్రైస్తవ సంఘంలో ఐక్యతను, సామాజిక సేవను, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త నాయకత్వం ఎంపికైంది. ఈ ఎన్నికలలో ప్రెసిడెంట్ రెవ. బి. విజ్ఞాన రావు వైస్ ప్రెసిడెంట్ పాస్టర్ శ్యామ్ కార్యదర్శి పాస్టర్ శామ్యూల్ రాజు పాస్టర్ ఇర్ఫా రవి జాన్సన్ ఉప కార్యదర్శిగా పాస్టర్ జోషి ట్రెజరర్‌గా పాస్టర్ జగదీష్ రికార్డింగ్ సెక్రెటరీగా, పాస్టర్ జేమ్స్, పాస్టర్ దినకర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌గా, పాస్టర్ ఎనోష్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. మమ్మల్ని ఎన్నుకున్న సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.  మణుగూరు క్రైస్తవ సంఘం ఐక్యత, సేవ అలాగే అభివృద్ధి కోసం మేము నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్లు  సంఘ పెద్దలు,సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad