నవతెలంగాణ-హైదరాబాద్: ఉన్నావో లైంగికదాడి బాధితురాలు కీలక వ్యాఖ్యలు చేసింది. కుల్ద్‌ప్ సింగ్ సెగార్‌కు కోర్టు బెయిల్ ఇవ్వకముందు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఏం చేసిందని ప్రశ్నించారు. దేశ చరిత్రలో లైంగికదాడి కేసులో ప్రధాన నిందితుడికి బెయిల్ మంజూరు చేయడం విడ్డూరంగా ఉందని, ఢిల్లీ కోర్టు నిర్ణయంతో విస్తుపోయమని జాతీయ మీడియాకు వెల్లడించింది. దేశ చరిత్రలోనే ఈ తరహా నిర్ణయం ఏ హైకోర్టు కూడా తీసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నిందితునికి బెయిల్ మంజూరు సమయంలో సీబీఐ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ఇప్పుడు సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేయమేంటని ఆమె ప్రశ్నించింది.
మాజీ ఎమ్మెల్యే కుల్ద్‌ప్ సింగ్ సెగార్‌కు బెయిల్ ఇవ్వడాన్ని నిరసిస్తూ ఇండియా గేట్ వద్ద బాధితురాలతో పాటు ఆమె తల్లి ఆందోళన నిర్వహించారు. ఆమెను బలవంతంగా పోలీస్ వాహనంలో తరలించారు. దీంతో దేశ వ్యాప్తంగా రోజురోజుకు ఉన్నావో లైంగికదాడి బాధితురాలికి మద్దతు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని సీబీఐ భావించింది. ఈ మేరకు స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి నిందితునికి బెయిల్ రద్దు చేయాలని కోరనుంది. మరోవైపు బాధితులు కూడా సుప్రీంకోర్టులో ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేయనున్నారు.



