బంగారం, వెండి పతకాలు కైవసం
నారాయణ గ్రూప్ డైరెక్టర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీబీఎస్‌ఈ జాతీయ స్కేటింగ్ చాంపియన్‌షిప్, ఆరో ఫెడరేషన్ కుడో కప్, నేషనల్ చాంపియన్‌షిప్- 2025 క్రీడా పోటీల్లో నారాయణ విద్యార్థులు అపూర్వ ప్రతిభను చాటారు. విశిష్ట విజయాలతో నారాయణ స్కూల్స్ కీర్తిపతాకాన్ని దశదిశలా వ్యాప్తిచేశారు. నారాయణ స్కూల్‌లో కేవలం చదువులకు మాత్రమే పరిమితం కాకుండా, ఆసక్తి ఉన్న ఇతర క్రీడాంశాలతో పాటు విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉందనటానికి ఈ విజయాలు నిదర్శనంగా నిలుస్తున్నాయని నారాయణ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ సింధూర నారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.’సీబీఎస్‌ఈ నేషనల్ స్కేటింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో నారాయణ స్కూల్స్ మదురైకు చెందిన మాస్టర్ ఎం. తమిళియన్ (అండర్-11 విభాగంలో) 500 మీటర్ల ఇన్‌లైన్ స్కేటింగ్ విభాగంలో బంగారు పతకం సాధించి తన ప్రతిభను చాటుకున్నారు.
కుడో ఇంటర్‌నేషనల్ ఫెడరేషన్ ఇండియా (కేఐఎఫ్‌ఐ అసోసియేషన్) నిర్వహించిన ఆరో ఫెడరేషన్ కుడో కప్ నేషనల్ చాంపియన్‌షిప్ 2025లో నారాయణ స్కూల్స్ కటక్‌కు చెందిన విద్యార్థులు ఆయుష్ కుమార్ లేంకా (అండర్-12 ) బార్సు, 30 కిలోల విభాగంలో వెండి పతకం, సులగ లేంకా (అందర్-15) గర్ల్స్, 54 కిలోల విభాగంలో వెండి పతకం సాధించి జాతీయ స్థాయి క్రీడా వేదికపై తమ ప్రతిభను ప్రదర్శించి నారాయణ కుటుంబానికి గర్వకారణమయ్యారు’.అని పేర్కొన్నారు. ‘అత్యున్నత క్రీడా వేదికలపై ఘన విజయం సాధించిటం ఎంతగానో గర్వకారణమనీ, ఈ అద్భుత విజయం నారాయణ విద్యార్థుల కృషి, క్రమశిక్షణ, అచంచలమైన సంకల్పానికి ప్రతిరూపంగా నిలుస్తుంద’ని తెలిపారు. స్కేటింగ్‌లో తమిళినియన్ అద్భుతంగా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, కుడోలో ఆయుష్, సులగ్నా తమ అత్యుత్తమ ప్రతిభతో రెండు వెండి పతకాలు సాధించడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.
ప్రతి విజయం విద్యార్థుల్లో ఎనలేని స్ఫూర్తిని నింపుతుందని తెలిపారు. నారాయణ స్కూల్స్ నిరంతర గైడెన్స్, చదువుకు ఆటంకం లేని విధంగా సడలింపులు అందిస్తున్నదని పేర్కొన్నారు. విద్యార్థులు వారికి ఆసక్తి గల రంగాల్లో రాణించటం కోసం సహాయసహకారాలను అందిస్తున్నదని తెలిపారు. విద్యార్థుల విజయాలను గౌరవించటానికి, నారాయణ స్కూల్స్ విద్యార్థుల ప్రయత్నాలను ప్రత్యేక ప్రశంసలతో గుర్తిస్తున్నదని తెలిపారు. విద్యార్థులకు నగదు బహుమతులతో పాటు విద్యా ప్రయాణంలో వెనుకబడిన పాఠాలను కవర్ చేయటానికి అదనపు తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విద్యారంగంలో 47 సంవత్సరాల గర్వించదగిన వారసత్వంతో, నారాయణ స్కూల్స్ విద్య, క్రీడలు అంతకు మించిన సమున్నత స్థానాలను చేరుకునే దిశగా నడిపిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి క్రీడా కలలకు మద్దతు ఇవ్వటానికి ఎంతగానో ప్రేరేపిస్తున్నాయని పేర్కొన్నారు.
జాతీయ క్రీడా పోటీల్లో నారాయణ విద్యార్థుల అపూర్వ ప్రతిభ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



