Saturday, July 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీవాణి మృతిపై తొలగని ప్రతిష్టంభన 

శ్రీవాణి మృతిపై తొలగని ప్రతిష్టంభన 

- Advertisement -

ఆత్మహత్యకు బాధ్యులు ఎవరు..?
ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు తేల్చింది ఏమిటి..
నవతెలంగాణ – పరకాల
: గత నెల 30వ తేదీన పరకాల మండలం మల్లక్కపేట గురుకుల పాఠశాలలో బలవన్మరణానికి పాల్పడిన పదవ తరగతి విద్యార్థిని శ్రీవాణి మృతిపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. శ్రీవాణి ఆత్మహత్యకు కారణం ఏమిటి…? అందుకు బాధ్యులు ఎవరు…? అనే ప్రశ్నలకు తోడు శ్రీవాణిది ఆత్మహత్యనా…? హత్యనా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి వివరణ ఇవ్వకపోగా.. ఘటనా స్థలం వద్దకు మీడియాను అనుమతించకపోవడం పట్ల పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోంది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి ఈశ్వర్ ఫిర్యాదు మినహా పోలీసులు ఇప్పటివరకు తమ దర్యాప్తులో ఏమి తేలిందో వెల్లడించకపోవడం గమనార్హం. ఇందుకు సంబంధించి నవతెలంగాణ పత్రిక పరిశీలనలో అనేక అంశాలు వెలుగు చూస్తున్నాయి.

శ్రీవాణి మృతికి బాధ్యులు ఎవరు…

 శ్రీవాణి మృతికి ఓ ఉపాధ్యాయురాలు కారణమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ ఉపాధ్యాయురాలు విద్యార్థినికి సంబంధించిన వ్యక్తిగత విషయాల్లో తలదూర్చి డిటెక్టివ్ లా వ్యవహరించడంతో తీవ్ర ఒత్తిడికి లోనైనా శ్రీవాణి బలవన్మరణానికి పాల్పడ్డట్లు విద్యార్థులతో పాటు, సహాధ్యాపకుల మద్య చర్చ జరుగుతుంది. శ్రీవాణి మానసిక ఆందోళనకు ఒత్తిడికి కారణమైన ఆ ఉపాధ్యాయురాలు ఎవరు. వారి మధ్యలో జరిగిన అంశం ఏంటి అనేది ప్రస్తుతం చర్చ నీ అంశంగా మారుతుంది. అంతేకాకుండా ఈ ఘటనలో మరో అంశం కూడా చర్చకు వస్తుంది. శ్రీ వాణి తనకు సంబంధించిన అభిప్రాయాలను నోట్స్ రూపంలో రాసుకునట్లు తెలుస్తుంది.

ఆ నోట్స్లో తన తల్లి జ్ఞాపకాలు నెమరు వేసుకోవడంతో పాటు తనకు బ్రతకాలని లేదని, నేను నీ వద్దకే వస్తానమ్మా అంటూ రాసుకుందనేది మరొక అంశం. తల్లి జ్ఞాపకాలకు సంబంధించి, తాను తన వద్దకే వస్తాను అనుకుంటున్న అంశానికి కారణాలు ఏంటి అనేది స్పష్టత లేదు. కానీ ఈ కేసులో ఈ కారణాన్ని బూచిగా చూపి నిందితులను ఎస్కేప్ చేయించే ప్రయత్నం ముమ్మరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. దీని వెనకాల రాజకీయ ప్రామేయమైన ఉందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 హత్యా…? ఆత్మహత్య…?

విద్యార్థిని మృతికి సంబంధించి అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికీ కొన్ని అంశాలకు స్పష్టతనే లేకుండా పోయింది. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు ఇప్పటివరకు బయట పెట్టలేకపోతున్నారు. దాంతో ఇంతకు శ్రీవాణిది హత్య.‌‌.. ఆత్మహత్యా.. ? అనే అనుమానాలు లేక పోలేదు. శ్రీవాణి ఆత్మహత్యకు ముందు తన తరగతి గదిలో ఉంది. తన తరగతి గది నుండి వాష్ రూమ్ కోసమని ఇద్దరు సహా విద్యార్థులతో కలిసి వెళ్ళింది. అక్కడనుండి వారిని వెనకకు పంపినట్లు సమాచారం. అదే సమయంలో ఆ పక్కన ఉన్న మరో బ్లాక్ వాష్ రూమ్లలో హౌస్ కీపింగ్ సిబ్బంది క్లీన్ చేస్తున్నట్లు సమాచారం. వీటన్నింటితో పాటు శ్రీవాణి ఆత్మహత్యకు పాల్పడందనేది వాష్ రూమ్ బయట ఓపెన్ ప్లేస్లో ఇలా అనేక అంశాలను పరిశీలిస్తే ఆత్మహత్య అక్కడ సాధ్యమేనా అనేది సందేహాస్పదంగా కనిపిస్తోంది.

పర్యవేక్షణ లోపమేనా….

కర్ణుని చావుకు కారణాలు అనేకం అన్నట్లు శ్రీవాణి మృతి వెనకాల సైతం అనేక అంశాలు తోడై ఉన్నాయి. అందుకు తన కుటుంబ నేపథ్యం, వ్యక్తిగత వ్యవహారంలో టీచర్ ఇన్వెస్టిగేటెడ్ గా వ్యవహరించడంతో పాటు పాఠశాల యజమైన నిర్లక్ష్యం సైతం స్పష్టంగా కనిపిస్తుందనేది పలువురి వాదన. ఈ ఆర్థిక సంవత్సరంలో గురుకుల పాఠశాలలో అసిస్టెంట్ కేర్ టేకర్ పోస్టులను రాష్ట్రవ్యాప్తంగా తొలగించడం జరిగింది. అందులో భాగంగానే మలక్కపేట గురుకుల పాఠశాలలో సైతం అసిస్టెంట్ కేర్ టేకర్ ను తొలగించడం జరిగింది. ఆ పోస్టు కనుక తొలగించకపోయి ఉంటే ఈరోజు ఇంత ఘోరం జరిగి ఉండేది కాదనేది వాదన.

ఎందుకంటే ఘటన జరిగిందనుకుంటున్న సమయంలో సూసైడ్ స్పాట్ పూర్తిగా కేర్ టేకర్ అబ్జర్వేషన్ లో ఉంటూ ఉండేది ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని పలువురు అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా కేర్ టేకర్ విద్యార్థులు ఎవరైనా ఏదైనా కారణంతో బయటికి వస్తే కారణం తెలుసుకొని ఆ విద్యార్థి సకాలంలో క్లాస్ రూమ్కు హాజరయ్యేలా ప్రయత్నించేవారు. ఈరోజు కేర్ లేకపోవడం అనేది సైతం ఈ ప్రమాదంలో ఒక భాగంగా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ శ్రీవాణి మృతి ఆ కుటుంబానికి తీర్చలేనిలోటు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -