- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: గాజాపై శనివారం ఉదయం జరిపిన ఇజ్రాయిల్ దాడుల్లో నలుగురు చిన్నారులతో సహా 37 మందికి పైగా మృతి చెందారు. ఈ విషయాన్ని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. దాడులు ఒకవైపు అయితే.. ఆకలితో చనిపోయేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో ఆకలితో ఇద్దరు చనిపోయారు. దీంతో ఆకలి మరణాల సంఖ్య 273కి చేరింది. వీరిలో 112 మంది చిన్నారులే ఉండడం గమనార్హం.
- Advertisement -